న్యూజిలాండ్ కేబినెట్ మంత్రిగా భారత సంతతికి చెందిన మహిళ..!

Monday, November 2nd, 2020, 05:56:09 PM IST

భారత సంతతికి చెందిన మహిళ ప్రియాంకా రాధాకృష్ణన్ న్యూజిలాండ్ కేబినెట్ మంత్రిగా ఎంపికయ్యారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా పరవూర్ ప్రియాంక స్వస్థలం. ఆమె విద్యాబ్యాసం అంతా న్యూజిలాండ్‌లోనే జరిగింది. అయితే 2017లో తొలిసారిగా ప్రియాంక న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశించగా, వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా కూడా పనిచేశారు.

అయితే ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన ఎన్నికలలో ఆ దేశానికి జెసిండా ఆర్డెర్న్‌ను రెండోసారి ప్రధానిగా గెలిచారు. దీంతో జెసిండా ఆర్డెర్న్‌ మంత్రివర్గంలో ప్రియాంకా రాధాకృష్ణన్‌కు యువజన వ్యవహారాలు, సామాజికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, డైవర్సిటీ, ఎథ్నిక్ కమ్యూనిటీస్ శాఖలను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రియాంకా రాధాకృష్ణన్‌కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్‌ దేశంలో ఈ స్థాయికి ఎదిగిన తొలి భారతీయురాలు అమె అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన జెసిండాకు కూడా కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు