తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని అందుకే ఏ ఎన్నికలు వచ్చిన ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని అన్నారు.
అయితే దుబ్బాకలో కూడా గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం పక్కా అని అన్నారు. ఇక రేవంత్ గురుంచి మాట్లాడుతూ ఆయన ఒకప్పుడు టీడీపీ అని ఇప్పుడు కాంగ్రెస్, రేపోమాపో బీజేపీలోకి పోతారని అన్నారు. తన దృష్టిలో రేవంత్రెడ్డి అసలు లీడరే కాదని , ప్రస్తుతం ఆయనను ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు చాలా మంది త్వరలోనే పార్టీలు మారబోతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.