ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తుంది – కేటీఆర్

Friday, February 12th, 2021, 03:00:12 AM IST


ఐటీఐఆర్ ప్రాజెక్టుపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదట్లోనే ఐటీఐఆర్‌పై కేంద్రానికి అనేక విజ్ఞప్తులు చేశామని అన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై లోక్‌సభలో కేంద్రమంత్రి సంజయ్ దొత్రే చేసిన ప్రకటనపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీఐఆర్‌పై కేంద్రం అడిగిన సమాచారం రాష్ట్రం ఇవ్వలేదన్నది పూర్తిగా అవాస్తవమని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

అయితే రాష్ట్రం ఏర్పాడ్డాక 2014 జూన్‌ నెలలోనే ఐటీఐఆర్‌పై సీఎం కేసీఆర్‌ ప్రధానికి ప్రత్యేకంగా లేఖ రాశారని అన్నారు. ఐటీఐఆర్‌పై కేంద్రానికి రెండుసార్లు డీపీఆర్‌ ఇచ్చామని, 10 సార్లు లేఖ రాశామని అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదని కేటీఆర్ వెల్లడించారు. అయితే 2016లో కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున డీపీఆర్‌లను కేంద్రానికి సమర్పించామని చెప్పుకొచ్చారు. ఐటీఐఆర్‌పై రాష్ట్రాన్ని నిందించడం కేంద్రానికి, బీజేపీ రాష్ట్ర నేతలకు తగదని మంత్రి కేటీఆర్ అన్నారు.