వాటి కోసం నిధులు మంజూరు చేయండి – మంత్రి కేటీఆర్

Wednesday, December 30th, 2020, 03:22:55 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పురపాలక శాఖ ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు, పనులకు నిధులు మంజూరు చేయండి అంటూ పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులకు లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర సివరేజ్ మాస్టర్ ప్లాన్ కోసం నిధులు మంజూరు చేయాలంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప సింగ్ పురి మరియు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లకు లేఖ రాశారు.

అయితే వ్యూహాత్మక నాలా అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలి అంటూ మంత్రి కేటీఆర్ కోరారు. అంతేకాక వరంగల్ లో మెట్రో నియో ప్రాజెక్ట్ కి నిధులు విడుదల చేయాలని మరొకసారి సూచించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా పురపాలక శాఖ తలపెట్టిన అభివృద్ది కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం మాత్రమే కాకుండా, రానున్న కేంద్ర బడ్జెట్ లో 20 శాతం నిధులను మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.