తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్ గా మారుతోంది…కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Sunday, November 22nd, 2020, 08:00:48 PM IST

హైదరాబాద్ లో హెచ్ ఐసీసీలో నిర్వహించిన బ్రాండ్ హైదరాబాద్ ఫ్యూచర్ రెడీ సదస్సు లో పాల్గొన్న కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ఒక్క రోజులో, ఒక్క ప్రభుత్వం తో హైదరాబాద్ కి బ్రాండ్ ఇమేజ్ రాలేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుతూనే, వృద్ధిని కొనసాగించాలి అని అభిప్రాయ పడుతున్నాం అని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఐదేళ్లలో ఐటీ పెట్టుబడులు రాష్ట్రంలో రెట్టింపు అయ్యాయి అని, అయిదు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్ తమ రెండో చిరునామా గా ప్రకటించాయి అని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఇప్పటికే పలు కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40 శాతం కార్య రూపం దాల్చాయి అని అన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షిత నగరం అని పేర్కొన్నారు.

అయితే అమెజాన్ కంపనీ మొదట బెంగళూర ఎంచుకుంది అని, అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పన్ను విధానాలు నచ్చి అమెజాన హైదరాబాద్ కి వచ్చింది అని అన్నారు. అమెజాన్ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్ లో ఉందని మంత్రి అన్నారు. కేవలం ఆరేళ్లలో హైదరాబాద్ స్టార్ట్ అప్ లకు స్వర్గధామం గా మారింది అని పేర్కొన్నారు. అయితే ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనకబడింది అనేది పరిశీలించి కుంటున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్ హబ్ గా మారుతోంది అని అన్నారు.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో రాష్ట్రాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెడతామని మంత్రి వ్యాఖ్యానించారు. అన్ని రంగాల అభివృద్ది విషయాల పై ప్రస్తావించిన మంత్రి కేటీఆర్ హెల్త్ కేర్ రంగంలో రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో అవకాశం ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. డికార్బనైజేశన్, డిజిటలైజేశన్, డీ సెంత్రలైజేషన్, ఈ మూడు డీ లదే భవిష్యత్ అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే కేటీఆర్ ఇచ్చిన స్పీచ్ కి పలువురు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా తెరాస దే విజయం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.