అభివృద్ధికి అండగా నిలవండి – మంత్రి కేటీఆర్

Friday, November 27th, 2020, 01:22:24 PM IST

తెలంగాణ రాష్ట్రం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో మరొకసారి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ లు అధికార తెరాస పై మాటల యుద్దాలు జరుగుతున్నాయి. అయితే తెరాస మాత్రం, తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత తమ పాలన లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు మరియు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మరొకసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హరితహరం స్ఫూర్తి తో నగరంలో పచ్చదనం పెంచేందుకు గత ఆరేళ్లలో ఎనలేని కృషి జరిగింది అని మంత్రి వ్యాఖ్యానించారు. నగరంలో పచ్చదనం పెంచేలా 934 కాలనీ పార్కులు, 460 ట్రి పార్కులు, 58 థీమ్ పార్కులు, వీటితో పాటుగా ఇంకా ప్లే పార్కులు, ట్రాన్సిట్ పార్కు లు అనేకం అభివృద్ది చేశాం అంటూ మంత్రి కేటీఆర్ అందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే డిసెంబర్ 1 నాడు జరిగే ghmc ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి అంటూ మంత్రి నగర ఓటర్లకు పిలుపు ఇచ్చారు.