బావా త్వరగా కోలుకో.. హరీశ్ రావుకు కరోనాపై కేటీఆర్ ట్వీట్..!

Saturday, September 5th, 2020, 03:37:13 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే సామాన్యులతో పాటు చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ ‌రావుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.

అయితే తనకు కరోనా వచ్చిన విషయాన్ని హరీశ్‌రావు స్వయంగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. తనకు అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా ఉన్నట్టు తేలిందని ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని, ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించాడు. అయితే దీనిపై స్పందించిన మంత్రి కేటీఅర్ నువ్వు త్వరగా కోలుకోవాలి బావా, నాకు నమ్మకముంది నువ్వు మిగతా వాళ్ల కంటే త్వరగా కోలుకుంటావు అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.