నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చూడాలి – కేటీఆర్

Tuesday, October 20th, 2020, 12:48:59 PM IST

హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నగర వాసులు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశం లో ఎమ్మెల్యేలు, మేయర్ మరియు డిప్యూటీ మేయర్ సైతం హజరు అయ్యారు. అయితే రాబోయే పది రోజుల్లో ఎమ్మెల్యే లు అంతా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలి అని మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే ఈ భారీ వరదల వలన నష్టపోయిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సాయం అందేలా చూడాలి అని మంత్రి వ్యాఖ్యానించారు.

వర్షాల కారణంగా నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు అని, బాధితులు అందరి కి కూడా సాయం అందాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను పర్యవేక్షించాలి అని, ముంపుకు గురి అయిన ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవాలి అని, వారికి భరోసా ఇవ్వాలి అని ఎమ్మెల్యే లకు మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు, ఎంపీ లు రెండు నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇవ్వాలని సూచించారు.