కేంద్రం ప్రకటించిన ఆ రూ.20 లక్షల ప్యాకేజీ ఎవరికి అందింది – కేటీఆర్

Wednesday, November 25th, 2020, 03:46:13 PM IST

హుషార్ హైదరాబాద్ విత్ కేటీఆర్ పేరిట నిర్వహించిన కార్యక్రమం కి ముఖ్యఅతిధి గా హజరు అయిన మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ మహమ్మారి కారణం గా అనేక రంగాలు దెబ్బతిన్నాయి అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ కి నలువైపులా షాపింగ్ మాల్స్ వచ్చాయి అని, అన్ని వైపులా హైదరాబాద్ అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఇందిరా పార్క్ వద్ద విద్యుత్ కోసం ధర్నాలు జరిగేవి అని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటివి ఎక్కడా జరగడం లేదు అని మంత్రి కేటీఆర్ అన్నారు.

అయితే తను చదువుకొనే రోజుల్లో హైదరాబాద్ లో కర్ఫ్యూ ల కారణంగా సెలవులు వచ్చేవి అని అన్నారు. అంతేకాక తెరాస అధికారంలోకి వచ్చాక అరగంట కూడా కర్ఫ్యూ విధించలేదు అంటూ గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఎవరికి అందింది అని సూటిగా ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు దుష్పలితాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు చిరు వ్యాపారులను దెబ్బ తీసింది అంటూ మంత్రి పేర్కొన్నారు.