తెలంగాణకు బీజేపీ చేసిన మేలు ఒక్కటి కూడా లేదు – మంత్రి కేటీఆర్

Thursday, March 11th, 2021, 03:04:21 AM IST


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్-రంగారెడ్డి–మహబూబ్ నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధి సురభి వాణిదేవికి రికగ్నిషన్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. నెక్లెస్ రోడ్ లోని జలవిహార్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటిఆర్ ఆరేండ్ల కింద ఆవిర్భవించిన తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిన మేలు ఒక్కటి కూడా లేదని, అలాంటప్పుడు ఎలా ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.

అయితే హైదరాబాదులో ఈ ఆరు ఏళ్ళలో ఏ ఒక్క సంఘటన జరగలేదని, రాష్ట్రమంతా చాలా ప్రశాంతంగా ముందుకు వెళుతుందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో ఒక్క హామీ నెరవేర్చకుండా ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నేతలను పట్టభద్రులు గట్టిగా నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు ఎందుకు ఇన్నిరోజులు నోరు మెదపలేదని అన్నారు.