అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడమే బీజేపీ పాలసీ – కేటీఆర్

Tuesday, November 24th, 2020, 12:56:45 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నడుస్తోంది. ఒక పక్క తెరాస మేనిఫెస్టో ను విడుదల చేసి ప్రజల్లోకి ఆయా పథకాలను, కార్యక్రమాలను గురించి తెలిపేందుకు నేతలు సిద్దంగా కాగా, ఇటు బీజేపీ తెరాస పై ఎదురుదాడి చేస్తున్న సంగతి తెలిసిందే. తెరాస అమలు చేయని హామీలు అంటూ బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అయితే దీని పై మంత్రి కేటీఆర్ గట్టిగానే స్పందించారు.

బీజేపీ నేతలు గోబెల్స్ కజిన్స్ లా మాట్లాడుతున్నారు అని సెటైర్స్ వేశారు. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు సైతం అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. అయితే ప్రజల కష్టాలను తీర్చినందుకా ఛార్జ్ షీట్ విడుదల చేసింది అంటూ బీజేపీ ను సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతు బందు అమలు చేస్తున్నాం అని కేటీఆర్ అన్నారు. ఇంటింటికీ మంచినీళ్ళు, వేలాది గురుకులాలు పెట్టీ పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే తెరాస పై ఛార్జ్ షీట్ విడుదల చేశారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటలు కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని కేంద్ర మంత్రులు చెప్పారు అని అన్నారు. అయితే అన్నింటినీ ప్రైవేట్ పరం చేయడమే బీజేపీ పాలసీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. బీజేపీ కి అవకాశం ఇస్తే హైదరాబాద్ ను కూడా అమ్మేసారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.