ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్…ఎమ్మెల్సీ రామ్ చందర్రావుకి కేటీఆర్ గట్టి కౌంటర్!

Monday, March 1st, 2021, 02:32:05 PM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం లో అధికార పార్టీ, ప్రతి పక్షాలు వీటిని ప్రతిష్టాత్మకం గా భావిస్తున్నాయి. అయితే ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు వేసిన సవాల్ కి కేటీఆర్ ఘాటు గా స్పందించారు. ఉస్మానియా యూనివర్సిటీ గేటు బయట సోమవారం ఉదయం 11 గంటలకు వస్తాను అని, మీరు రండి చర్చిద్దాం అంటూ ట్విట్టర్ ద్వారా ఆదివారం వెల్లడించారు. అయితే నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాను, ఎక్కడ మిస్టర్ కేటీఆర్ అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఇందుకు కేటీఆర్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.

అయితే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ సర్కార్ ఏడాది కి రెండు కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పింది, ఎవరికి ఇచ్చారో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. అంతేకాక జన్ ధన్ ఖాతా దారుల అకౌంట్ లలో 15 లక్షలు జమ చేస్తామని అన్నారు, దాని గురించి సంబందించిన డేటా వెతుకుతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ అంటూ సెటైర్స్ వేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.