వైద్యులు, సిబ్బంది సేవలను అందరూ గౌరవించాలి – మంత్రి కేటీఆర్

Saturday, August 15th, 2020, 06:29:33 PM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా దేశం లో రోజుకి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా పై పోరులో ప్రాణాలు తెగించి పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది సేవలను గుర్తించి, గౌరవించాలి అను మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సివిల్ ఆసుపత్రి లో వైద్య సిబ్బంది, ప్రజల కోసం ఇసొలేషన్ కిట్స్, సానిటైజ ర్స్, ఫేస్ షీల్డ్స్, పీపి ఈ కిట్స్ అందజేశారు. సిరిసిల్ల లో వైద్య సేవలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.

అయితే సివిల్ ఆసుపత్రి లో మధుమేహం తో బాధపడుతున్న 80 ఏళ్ల బామ్మ, కరోనా వైరస్ భారీ నుండి కోలుకున్న విషయాన్ని తెలిపారు. సివిల్ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తోనే బయట పడగలిగింది అని అన్నారు.అయితే ప్రజలు అందరూ కూడా వైద్యుల, సిబ్బంది సేవలను గుర్తించాలని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రాణాలకు తెగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు అని అన్నారు. ఈ మేరకు కరోనా పై పోరు లో కీలక పాత్ర పోషిస్తున్న వారి పై ప్రశంసల వర్షం కురిపించారు.