పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం – కేటీఆర్

Thursday, November 12th, 2020, 03:57:05 PM IST

హైదరాబాద్ మహ నగరం లో బస్తీ దవాఖాన ల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ మేరకు నాంపల్లి లోని సయ్యద్ నగర్ లో మంత్రి కేటీఆర్ బస్తీ దవాఖాన ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ తో పాటుగా మేయర్ బొంతు రామ్మోహన్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం లో మంత్రి కేటీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కార్ పెద్ద పీట వేస్తున్నది అని మంత్రి కేటీఆర్ అన్నారు.ప్రతి ఒక్కరికీ కూడా మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు. బస్తీ దవాఖానా ల్లో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే ముఖ్యం గా బస్తీ దవాఖాన ల్లో డయాగ్నష్టిక్ సెంటర్లూ అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. అయితే ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 224 బస్తీ దవాఖాన లు ప్రారంభించాం అని, ఇంకా 125 బస్తీ దవాఖాన లు త్వరలో ప్రారంభిస్తాం అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా బస్తీ దవాఖాన లో చెక్ చేయించు కోవాలి అని సూచించారు.