హైదరాబాద్ కి 400 ఏళ్ల చరిత్ర ఉంది – మంత్రి కేటీఆర్

Thursday, November 26th, 2020, 03:07:57 PM IST

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని పొందిన సంగతి తెలిసిందే. అయితే సొంత రాష్ట్రాన్ని నడిపే సత్తా ఉందా అని అనుమానాలు వ్యక్తం చేశారు, నేడు హైదరాబాద్ అరుదైన నగరం అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ కి 400 ఏళ్ల చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. గతంలో 14 రోజులకొకసారి హైదరాబాద్ ప్రజలకు నీళ్ళు వచ్చే పరిస్తితి ఉండేది అని, ఇప్పుడు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నాం అని తెలిపారు. హైదరాబాద్ నీటి సరఫరా కోసం 1920 లో గండిపేట చెరువు కట్టారు అని మంత్రి గుర్తు చేశారు. అయితే త్వరలో కేశవపురం రిజర్వాయర్ నిర్మించబోతున్నాం అని, సామాన్యుడికి ఏం చేయాలన్నదే కేసీఆర్ తొలి ప్రాధాన్యత అని మంత్రి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పడే నాటికి కరెంట కోతలతో అల్లాడది అని, అధికారం లోకి వచ్చాక ఆరు నెలల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించాం అని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి లో ఇప్పుడు తెలంగాణ రెండవ స్థానం లో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఎంతో కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచాం అని, ప్రభుత్వం పై విశ్వాసం వలనే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయ్ అని తెలిపారు.