గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు మొదలైంది. ఈ ప్రక్రియ నేడు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నంది నగర్ లోని పోలింగ్ కేంద్రానికి మంత్రి కేటీఆర్ సతీ సమేతంగా వెళ్లి ఎనిమిదవ నంబర్ పోలింగ్ బూత్ లో తన ఓటును వేశారు. అయితే ఓటు వేసిన అనంతరం మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఓటు వేయాలి అని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోనీ నగర అభివృద్ది లో భాగస్వామ్యులు కావాలి అని పిలుపు మాట్లాడారు కేటీఆర్.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 74,44,260 మంది ఓటర్లు ఉండగా, 1,122 మంది అభ్యర్థులు బరి లో ఉన్నారు. 150 డివిజన్ లలో పోలింగ్ జరగనుందగా, 48 వేల మంది అధికారులు, సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపద్యం లో ఈవిఎం లకు బదులుగా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించనున్నారు. మొత్తం 9,101పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 2,277 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించారు.