బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్..!

Tuesday, December 15th, 2020, 10:00:03 PM IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌ను జైలులో పెడతామని బీజేపీ నేతలు అంటున్నారని, జైలులో పెట్టేముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడాలని చెప్పుకొచ్చారు. అయితే కేసీఆర్‌కు ఉన్నది 40 ఎకరాల ఫామ్‌హౌజేనని బీజేపీ నాయకులు డ్రామాలను కట్టిపెట్టాలని సూచించారు.

అయితే 40 ఎకరాల ఫామ్‌హౌజ్ కోసం ఎవరైనా కాళేశ్వరం కడతారా అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ కట్టే దమ్ము లేదు కానీ ఆరోపణలు చేయడం మాత్రం బీజేపీ నేతలకు వచ్చని అన్నారు. అయితే దమ్ముంటే తమ అవినీతి నిరూపించు అవసరమైతే కోర్టుకు వెళ్లు అని బండి సంజయ్‌కు కొప్పుల ఈశ్వర్ సవాల్ చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారని, ఆరోపణలు చేయడం కాదు అది నిరూపించే సత్తా ఉండాలని అన్నారు.