ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని..!

Wednesday, September 23rd, 2020, 04:33:13 PM IST

ఏపీ మంత్రి కొడాలి నాని దేవాలయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొడాలి వ్యాఖ్యలను హిందూ ధార్మిక సంఘాలు, టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. హిందువులకు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని మోదీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కింద స్థాయి నాయకుల వైఖరితో మోదీ బజారున పడపడుతున్నారని అన్నారు.

అయితే ముందు నరేంద్ర మోదీని సతీసమేతంగా ఆలయాలకు రమ్మని చెప్పండంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించాకే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. స్వామి వారిపై నమ్మకంతోనే భక్తులు తిరుమలకు వస్తారని, శ్రీవారిని దర్శించుకునే సమయంలో డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని మరోసారి చెప్పుకొచ్చారు. అయితే తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. సీఎం జగన్‌కు కులాల, మతాలతో సంబంభం లేదని హిందూ దేవాలయానికి వచ్చినప్పుడు హిందువులా, చర్చిలో క్రైస్తవుడిలా, మసీదులో సమయంలో నవాబులా ఉంటారని అన్నారు.