వాటిపైనే ఆధారపడి బతికిన చరిత్ర చంద్రబాబు, దేవినేని ఉమాదే

Tuesday, January 5th, 2021, 07:32:38 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చోటు చేసుకుంటున్న పరిణామాలు అధికార పార్టీ వైసీపీ కి మరియు ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ కి మధ్యలో మాటల యుద్దాలకి కారణం అవుతున్నాయి. అయితే గుడివాడ నియోజక వర్గం లో పేకాట క్లబ్బుల పై జరిగిన దాడుల విషయంలో మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం నాడు మీడియా సమావేశం లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో పేకాట శిబిరాలు ఎక్కడ నిర్వహిస్తున్నా ఉపేక్షించేది లేదు అని తెలిపారు. అయితే జూదం ఆడేవారిలో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదు అని మంత్రి కొడాలి నాని అన్నారు. జూద శిబిరాల విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉంటారు అని తెలిపారు. అయితే తాను, సీఎం జగన్ ఆదేశాలు ఇస్తేనే గుడివాడ నియోజక వర్గం లో పేకాట శిబిరాలపై దాడులు చేసి, అక్కడ జూదం ఆడే వారిని పట్టుకున్నారు అని తెలిపారు. అయితే ఇలాంటి అసాంఘిక చర్యలను ఎంతమాత్రం కూడా సహించబోం అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమా లు పేకాట క్లబ్బుల పై ఆధారపడి బతికిన చరిత్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దాడుల అంశం పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పలువురు పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.