టీడీపీనీ జూనియర్ ఎన్‌టీఆర్ వచ్చినా కాపాడలేడు – కొడాలి నాని

Monday, August 10th, 2020, 12:55:36 PM IST

ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కొడాలి నాని టీడీపీ పరిస్థితి ఇక క్లైమాక్స్‌కి చేరిందని అన్నారు. టీడీపీనీ ఇక జూనియర్ ఎన్‌టీఆర్ వచ్చినా కాపాడే పరిస్థితి లేదని అన్నారు.

అయితే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీ ఇప్పుడు తెలంగాణలో కనుమరుగయ్యిందని, ఏపీలో కూడా అదే పరిస్థితికి చేరుకుందని అన్నారు. ఏపీలో టీడీపీని తినేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని, గత ఎన్నికలకు ముందు కరోనా లాంటి బీజేపీ ముందు చంద్రబాబు మాస్క్ లేకుండా పోరాటం చేశారని ఇప్పుడు బీజేపీ టీడీపీనీ టార్గెట్ చేసిందని అన్నారు.