వెన్నుపోటు కార్యక్రమాలు మా పార్టీలో జరగవు…చంద్రబాబు పై కొడాలి నాని ఫైర్

Sunday, November 15th, 2020, 10:00:40 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను టార్గెట్ చేస్తూ వైసీపీ కీలక నేత, మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎల్లో మీడియా తో కుమ్మక్కై సొంత డబ్బా కొట్టుకుంటున్నారు అని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి దద్దమ్మ పాలనలో రాష్ట్రాన్ని ఇష్టారీతిన దోచుకున్నారు అని ఆరోపించారు. జగన్ ను సీఎం పదవి నుండి దించేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఎమ్మెల్యే ల మద్దతు కూడగట్టారు అంటూ అసత్య ప్రచారం మొదలు పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు, అయితే చంద్రబాబు లాంటి వెన్నుపోటు కార్యక్రమాలు మా పార్టీలో జరగవు అంటూ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి రెక్కల కష్టంతో ప్రభుత్వం ఏర్పడింది అని మంత్రి పేర్కొన్నారు. బోగస్ న్యూస్ ఛానల్ ప్రచారం తో సీఎం జగన్ ను ఏం చేయలేరు అని తెలిపారు. వెన్నుపోటు పొడిచే సంస్కృతి తమకు లేదు అని, తనలానే అందరూ ఉంటారు అని చంద్రబాబు భావిస్తున్నాడు అని మంత్రి సెటైర్స్ వేశారు. ప్రజల కోసం పెట్టీ ప్రజల చేత ఎన్నొకబడిన వ్యక్తి సీఎం జగన్ అని, సీఎం జగన్ ను దించేస్తే ప్రజలు ఊరుకోరు అని, చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు అంటూ మంత్రి కొడాలి నాని అన్నారు.