రాబోయే రోజుల్లో తెరాసను ఎవరూ రక్షించలేరు

Monday, January 18th, 2021, 07:27:25 AM IST

హైదరాబాద్ లో బీజేపీ కార్యవర్గ సమావేశం లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ తో స్నేహం లేకపోయి ఉంటే తెరాస గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పది స్థానాలు కూడా గెలిచి ఉండేది కాదు అని అన్నారు. అయితే ఆ రెండు పార్టీలు చేసుకున్న చీకటి ఒప్పందం కారణం గా తెరాస 50 స్థానాల వరకూ గెలుపొందింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ దుబ్బాక తరహా పోటీ ఉందని, కాకపోతే రాజకీయ పార్టీ గా ఆనాడు గ్రహించలేక పోయామని అన్నారు.

అయితే తెరాస అధికార దుర్వినియోగం కారణం గా బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోలే పోయింది అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో తెరాసను ఎవరూ రక్షించ లేరు అంటూ కిషన్ రెడ్డి అన్నారు. అయితే రాబోయే రెండు సంవత్సారాలు బీజేపీ కి చాలా కీలకం అని,రాష్ట్రంలో మార్పు తీసుకు రావాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అని, అది బీజేపీ తో మొదలు కావాలని కోరుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ మేరకు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు, తదితర కార్యాచరణ కి కిషన్ రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు.