వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అభివృద్ది దిశగా వెళ్తోంది – మంత్రి కన్నబాబు

Sunday, November 1st, 2020, 03:40:32 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి. అయితే విశాఖ పట్టణం లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కన్నాబాబు సైతం పాల్గొన్నారు. వైసీపీ నేతల తో పాటుగా, పలువురు ప్రముఖులు హజరైన ఈ కార్యక్రమం లో జాతీయ పథకానికి గౌరవం చేసి, పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేశారు. అయితే ఈ మేరకు కన్నబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు పోరాట పటిమ ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూడు రాజధానులు ఏర్పాటు అభివృద్ధిక శ్రీకారం చుడుతుంది అని మంత్రి పేర్కొన్నారు. అయితే విశాఖ లో పరిపాలన రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ది అవుతుంది అని అన్నారు, అయితే స్వప్రయోజనాల కోసం కొందరు రాష్ట్ర అభివృద్ధిక అడ్డుపడినా, వెనకడుగు వేయకుండా ప్రభుత్వం అభివృద్ది దిశగా వెళ్తోంది అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే జిల్లా లోనీ 2.53 లక్షల మందికి 4,457 ఎకరాల ప్రభుత్వ మరియు అస్సైన్ భూమిని సేకరించి త్వరలో లబ్ది దారులకు ఇస్తాం అని తెలిపారు. అంతేకాక తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని అన్నారు.