ఆ పార్టీలు రెండూ తెలంగాణ ద్రోహులే – మంత్రి జగదీశ్వర్ రెడ్డి

Thursday, February 4th, 2021, 08:45:55 AM IST

తెలంగాణ రాష్ట్రం లో నాగార్జున సాగర్ ఉపఎన్నిక విషయం లో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్ష పార్టీ నేతలు తమ సత్తా చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ లు ప్రతి పక్ష పార్టీ గా బలోపేతం అయ్యేందుకు ఈ స్థానాన్ని దక్కించుకోవడం కోసం తీవ్ర కృషి చేస్తున్నారు. అయితే ఈ మేరకు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రతి పక్ష పార్టీ ల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మరియు కాంగ్రెస్ రెండూ తెలంగాణ ద్రోహులే అని, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీల అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం అంటూ చెప్పుకొచ్చారు.తెలంగాణ రాష్ట్రం లో అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు ఒక్క తెరాస కే ఉందని స్పష్టం చేశారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

అయితే సూర్యాపేట, కోదాడ, మునగాల లో 2.51 కోట్ల రూపాయల తో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం లో ఎన్నో కోట్ల రూపాయల తో దేవాలయాల ను పునరుద్ధరించామని, ఆధ్యాత్మికతకు రాజకీయ రంగులు పూసి, చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గు చేటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.