సీఎం కేసీఆర్ జన్మదినాన – మంత్రి హరీష్ రావు సరికొత్త ప్లాన్స్…

Friday, February 14th, 2020, 01:25:43 AM IST

ఈ నెల 17న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి 66వ జన్మదినం. కాగా ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు గారు సిద్ధిపేట జిల్లాలో పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు తెరాస నాయకులు, కార్యక్రతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరు కూడా ఒక్కొక్క మొక్కను నాటాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఒక లక్షకు పైగా మొక్కలు నాటాలని మంత్రి హరీష్ రావు లక్షంగా పెట్టుకున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆకుపచ్చవనాన్ని తయారు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించాలన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఈ కార్యక్రమంలో అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని మంత్రి హరీష్ రావు వెల్లడించారు.