స్వరాష్ట్ర భక్తి ఎక్కడ పోయింది.. బండి సంజయ్‌పై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌..!

Friday, March 26th, 2021, 12:31:58 AM IST


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా బండి సంజయ్‌ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదవులు శాశ్వతం కాదని ప్రజలు, రాష్ట్రం శాశ్వతమని అన్నారు. మాట్లాడితే దేశ భక్తి అంటూ మాట్లాడుతారని దేశ భక్తి ప్రతీ పౌరుడికి ఉంటుందని అన్నారు. స్వరాష్ట్ర భక్తి ఎక్కడకి పోయిందని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. చేతనైతే తెలంగాణ రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు తీసుకురండని అలా చేస్తే నిండు సభలో సన్మానం చేస్తామని అన్నారు.

ఇక పోతిరెడ్డి పాడు గురించి కొట్లాడింది టీఆర్‌ఎస్‌ పార్టీ అని, వైఎస్‌ని ఎదిరించి మంత్రి పదవులు త్యాగం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. సాగునీటి రంగంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించినా కేంద్రం సాయం అందించడం లేదని అన్నారు. కాళేశ్వరం జాతీయ హోదాను కూడా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. తెలంగాణలో క్షుద్ర రాజకీయాలు మానుకోవాలని ఓ ఉద్యమ కారుడిగా అందరినీ కోరుతున్నానని మంత్రి హరీష్‌రావు అన్నారు.