బీజేపీ మాయమాటల పార్టీ.. మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు..!

Thursday, September 24th, 2020, 03:37:43 PM IST

బీజేపీపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు రాయపోల్ మండల కేంద్రంలో 266 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన హరీశ్ రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును ఆయన తప్పుపట్టారు. బీజేపీ అంటే బహుత్ బోల్నేకా పార్టీ అని ఎద్దేవా చేశారు.

అయితే తెరాసా చేతల పార్టీ అని బీజేపీ మాయమాటల పార్టీ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం బోరు బావుల వద్ద మీటర్లు పెట్టాలని అనుకుంటుందని, దానిని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా మీటర్లు పెట్టాలని చూస్తే, ప్రజలు చంద్రబాబు మీటర్లే పీకారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు.