రివేంజ్ ప్లాన్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై మంత్రి హరీష్ రావు ఫోకస్..!

Wednesday, November 18th, 2020, 03:03:05 AM IST


దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బదులు తీర్చుకునేందుకు మంత్రి హరీశ్ రావు సిద్దమయ్యాడు. తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా, ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీశ్ రావుకు దుబ్బాక ఉప ఎన్నిక ఓటమిని రుచిచూపించింది. అయితే దుబ్బాక ఓటమిపై రివేంజ్ ప్లాన్ తీర్చుకునేందుకు హరీష్ రావు జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

అయితే సంగారెడ్డి జిల్లా పరిథిలోని మూడు జీహెచ్ఎంసీ వార్డుల్లో టీఆర్ఎస్‌ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పఠాన్ చెరువు, రామచంద్రపురం, భారతినగర్ పరిధిలోని బూత్ స్థాయి కమిటీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. భారతి నగర్ డివిజన్ ఇంఛార్హ్‌గా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‎ను, రామచంద్రాపురం ఇంఛార్హ్‌గా గజ్వేల్‌కు చెందిన ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ వంటేరూ ప్రతాప్ రెడ్డిని, పఠాన్ చెరువు డివిజన్‎కు ఇంఛార్హ్‌గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బక్కీ వెంకటయ్యలను నియమిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటించాడు. దుబ్బాకలో జరిగిన పొరపాట్లను అంచనా వేసుకుని, ఇక్కడ ఏ విధంగా వ్యవహరించాలన్నది కూడా ముందస్తు అంచనా వేసుకున్నట్టు తెలుస్తుంది.