వైఎస్ షర్మిల కొత్త పార్టీపై మంత్రి హరీశ్ రావు కౌంటర్..!

Wednesday, February 10th, 2021, 07:05:10 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వైఎస్ షర్మిలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారని అన్నారు.

అయితే తెలంగాణపై కనీస పరిజ్ఞానం లేని వారు కొందరు ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా కేవలం రూ.12.500 మాత్రమే ఇస్తున్నారని కానీ తెలంగాణలో ఎకరానికి రూ.10 వేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.