ఎమ్మెల్యే పై భౌతిక దాడికి దిగడం శోచనీయం – మంత్రి హరీశ్ రావు

Tuesday, November 3rd, 2020, 06:31:45 PM IST

తెరాస కి చెందిన ఎమ్మెల్యే క్రాంతి పై జరిగిన దాడిని హేయమైన చర్య గా అభివర్ణించారు తెలంగాణ రాష్ట్ర అర్డిక శాఖ మంత్రి హరీశ్ రావు. బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. అయితే దళిత ఎమ్మెల్యే పై భౌతిక దాడికి దిగడం శోచనీయం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అయితే క్రాంతి పై పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు అని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. అయితే దుబ్బాక బీజేపీ ఎన్నికల ఇన్ ఛార్జ్ జితేందర్ రెడ్డి ఉంటే తప్పు కాదా అంటూ సూటిగా ప్రశ్నించారు.

అయితే జిల్లాకి చెందిన ఎమ్మెల్యే క్రాంతి సిద్దిపేట లో ఉంటే తప్పేంటి అని సూటిగా ప్రశ్నించారు. శాంతి భద్రతలు దెబ్బ తీయాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. అయితే బీజేపీ కార్యకర్తల దాడికి ముందే పోలీసులు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్ళారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే పోలీసుల తనిఖీ లో ఎటువంటి సామాగ్రి లభించలేదు అని మంత్రి వ్యాఖ్యానించారు. దుబ్బాక ఉపఎన్నిక లో తెరాస ను ఎదుర్కోలేక బీజేపీ కుట్రలకు పాల్పడుతోంది అని మంత్రి వ్యాఖ్యానించారు.