తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బ్యాట్‌తో అదరగొట్టాడు. మొన్నటి వరకు దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఫుల్ బిజీ బిజీగా గడిపిన హరీశ్ రావు కాసేపు క్రికెట్ ఆడి రిలీఫ్ అయ్యారు. సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొనడమే కాకుండా సిద్ధిపేట క్రికెట్ అసోసియేషన్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా నిర్వహించారు.
అయితే తన టీమ్ 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి దిగిన మంత్రి హరీశ్ వరుసగా బౌండరీలు బాదాడు. స్క్వేర్ కట్, కవర్ డ్రైవ్, డిఫెన్స్ ఆడుతూ వికెట్ల మధ్య కూడా బాగానే పరుగెత్తాడు. 150 స్ట్రయిక్ రేట్‌తో 12 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజ్‌లో కొద్దిసేపు ఉన్నా కూడా హరీశ్ రావు మెర్పు బ్యాటింగ్ చేయడంతో అభిమానులు, ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. అయితే ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.