ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు – మంత్రి హరీశ్ రావు

Sunday, August 9th, 2020, 04:40:20 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పై మంత్రి హరీష్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లాకి అవసరమైన పిపి ఈ కిట్స్, టాబ్లెట్స్, ఇంజెక్షన్లు, హోం క్వరంటెన్ కిట్స్ తెప్పించాం అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అధికారులతో, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా లో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.కరోనా వైరస్ మహమ్మారి పరీక్షలు ప్రతి రోజూ నిర్వహించాలి అని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అయితే ఈ మహమ్మారి ని ప్రాథమిక దశలో గుర్తించక పోవడం చేత ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి అని అన్నారు. గ్రామాల్లోకి కరోనా వైరస్ బాధితులను రాకుండా అడ్డుకుంటున్నారు అని, ఈ విషయం పై అధికారులు దృష్టి పెట్టాలని, దీని పై ప్రజలకు అవగాహన కల్పించాలి అని అన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కావొద్దు అంటూ హరీష రావు సలహా ఇచ్చారు. అంతేకాక కరోనా సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్స్ కి సైతం కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలి అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.