ఆపదలో ఉన్నవారికి సీఎం సహయనిధి అండగా నిలుస్తుంది

Thursday, December 17th, 2020, 06:04:03 PM IST

తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు మరొకసారి 34 మంది లబ్ధి దారులకు 13,39,500 రూపాయల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుపేదలకు సీఎం సహాయ నిధి వరం అని పేర్కొన్నారు. లబ్ది దారులకు తన నివాసంలోనే చెక్ లను పంపిణీ చేశారు హరీశ్ రావు. ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుంది అని అన్నారు. పట్టణానికి చెందిన 14 మందికి, సిద్దిపేట రూరల్ మండలం లో ముగ్గురికి, చున్నకొడూర్ మండలం లో 8 మందికి, నంగునూర్ మండలం లో ఐదుగురు కి, నారాయణ రావు పేట మండలం లో నలుగురి కి కలిపి మొత్తం 34 మందికి మంజూరు అయిన విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమంలో పలువురు తెరాస పాల్గొన్నారు.