జగనన్న బాణం షర్మిల.. మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..!

Wednesday, February 17th, 2021, 01:19:31 AM IST


తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలయ్యింది. తాజాగా షర్మిల కొత్త పార్టీ ప్రచారంపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్సం చలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ ఇస్తారని, ఆ తర్వాత చంద్రబాబు వస్తారని అన్నారు.

అయితే వీరు వస్తే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవన్నారు. సీఎం కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలి లేకపోతే ఇబ్బందులు తప్పవని, కేసీఆరే మన రక్షకుడు అని చెప్పుకొచ్చారు. ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ మనకు కష్టాలు తప్పవని మంత్రి గంగుల అన్నారు. ఇదిలా ఉంటే కొత్త పార్టీపై స్పీడ్ పెంచిన వైఎస్ షర్మిల ఇప్పటికే పలువురు కీలక నేతలతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. అయితే త్వరలోనే ఆమె కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని ప్రచారం కూడా జరుగుతుంది. l