వైఎస్ షర్మిలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గంగుల..!

Wednesday, February 17th, 2021, 04:14:26 PM IST

తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపధ్యంలో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ నిన్న మాట్లాడుతూ ఆంధ్ర పెత్తనం వస్తే మళ్లీ కష్టాలు తప్పవని జగనన్న బాణం అంటూ షర్మిల వస్తుందని, ఆ తర్వాత జగన్ ఎంట్రీ ఇస్తారని, ఆ తర్వాత చంద్రబాబు వస్తారంటూ కామెంట్‌ చేశారు. అయితే తాజాగా కరీంనగర్‌లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మంత్రి వైఎస్ షర్మిలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే జగన్ వదిలిన షర్మిల బాణం ఖచ్చితంగా బీజేపీ బాణంగానే తాము భావిస్తున్నామని అయినా జగన్ ఒక్క బాణం విసిరితే కేసీఆర్‌కు తెలంగాణలో కోట్ల బాణాలు ఉన్నాయని మంత్రి గంగుల అన్నారు. ఎవరు ఎన్ని బాణాలు విసిరిన కేసీఆర్ ముందు బలాదురే అని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక అన్ని పార్టీలు ఏకమయ్యాయని, ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ ముందు నిలువలేదని అన్నారు. టీఆర్ఎస్ సింగిల్ పార్టీగానే ఉంటుందని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు.