కరోనా ను ఎదుర్కొనేందుకు ఉన్న ఏకైక మందు ధైర్యమే – ఈటెల రాజేందర్

Thursday, August 20th, 2020, 05:09:19 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ కరోనా వైరస్ నుండి చాలా వరకు బాధితులు కోలుకోవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో పోలీసుల ఆధ్వర్యం లో ప్లాస్మా దానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్న మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ బాధితులకు మనో ధైర్యం కల్పించేలా నడుచుకోవాలి అని, కరోనా వైరస్ కి మంది లేదు అని, ఇందుకోసం ధైర్యం గా ఉండటమే ఏకైక మార్గం అని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

అయితే ప్లాస్మా థెరపీ గురించి సైతం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్లాస్మా థెరపీ ఎంతో మందికి ధైర్యం ఇచ్చింది అని అన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఔషధాలతో పాటుగా ఈ ప్లాస్మా థెరపీ ఎంతో మంది ప్రాణాలను కాపాదిండి అని తెలిపారు. అయితే ప్రపంచ మానవాళికి ప్లాస్మా చికిత్స తోడ్పాటు ఇస్తుంది అని ఈటెల రాజేందర్ అన్నారు. అయితే అన్ని ఆసుపత్రుల్లో కరోనా తో పాటుగా ఇతర వ్యాధులకు కూడా చికిత్స అందించాలని ఆసుపత్రి వర్గాలకు మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. అయితే ప్లాస్మా దానం చేసేందుకు donateplasma.hcsc.in లో కి వెళ్ళాలి అంటూ వెబ్ సైట్ ను లాంచ్ చేసారు.