తెలంగాణ మాజీ హోమ్ మినిస్టర్ నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కార్మిక నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి శ్రీ నాయని నర్సింహ రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం లో వారితో ఉన్న అనుబంధం మరువలేనిది అంటూ ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు. వారి మరణం తెరాస పార్టీ కి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని, వారి ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకి భగవంతుడు దైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
…కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ.. ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.(2/2)
— Eatala Rajender (@Eatala_Rajender) October 22, 2020