మెరుగైన వైద్య సేవలు తక్కువ ధరలో అందాలి

Monday, February 1st, 2021, 12:02:06 AM IST

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ ను నేడు ప్రారంభించారు. ఈ మేరకు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శాస్త్ర విజ్ఞానము పెరిగింది కానీ, ప్రజలకు తక్కువ ధరకి వైద్యం అందడం లేదు అని మంత్రి చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న మెడిసిన్ ను ప్రజలకు చేరవేయడం తమ కర్తవ్యం అంటూ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఈ మేరకు గత రోజులని గుర్తు చేస్తూ ప్రజలకు వైద్యం అందే విధానం గురించి మంత్రి తెలిపారు.

ప్రభుత్వ అలోపతి ఆసుపత్రుల కంటే ఆయుర్వేద ఆసుపత్రులు ఎక్కువగా ఉండేవి అని అన్నారు. అయితే ప్రస్తుతం ఆయుర్వేద వైద్యులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే చికిత్స కోసం ఎంతో మంది ఖర్చు పెట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అని, శాస్త్ర విజ్ఞానము పెరిగింది కానీ తక్కువ ధరకు వైద్యం అందడం లేదు అని అన్నారు. అయితే మెరుగైన వైద్య సేవలు తక్కువ ధరకు అందాలి అంటూ మంత్రి ఈ మేరకు తెలియజేశారు. కరోనా వైరస్ మహమ్మారి ను ఎదుర్కోవడం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా చాలా వరకు కట్టడి అయిన సంగతి తెలిసిందే. వాక్సినేషన్ ప్రక్రియ లో సైతం తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతుంది.