ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – మంత్రి ఈటెల రాజేందర్

Monday, August 17th, 2020, 03:13:04 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కొద్ది రోజుల నుండి వర్షం కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఉత్తర తెలంగాణ లో కనీవినీ ఎరుగని రీతిలో వర్షం కురిసింది అని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నాలుగు రోజుల్లోనే చెరువులు , కుంటలు, జలాశయాలు నిండాయి అని, భారీ వర్షాల కారణంగా చెరువులు, కాల్వలకు గండ్లు పడి రోడ్లు దెబ్బ తినడం మాత్రమే కాకుండా, చాలా వరకు రాకపోకలకు అంతరాయం కలిగింది అని అన్నారు. అయితే సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అని ఈ మేరకు ఈటెల రాజేందర్ అన్నారు.

వర్షాల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిశీలించాలని అధికారులకు ఆదేశించిన విషయాన్ని తెలిపారు. సీఎం కేసీఆర్ నేడు సమీక్ష నిర్వహించారు అని, రైతుల కి ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే రాబోవు 48 గంటలు తీవ్రమైన వర్షాలు ఉంటాయి అని అన్నారు.అయితే ఇపుడు ఉన్న పరిస్తితుల్లో ప్రజలు అందరు కూడ అప్రమత్తం గా ఉండాలి అని అన్నారు.