కరోనా వైరస్ వాక్సిన్ అంశం పై మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Thursday, November 12th, 2020, 01:22:36 PM IST

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా వైరస్ వాక్సిన్ అంశం పై నేడు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా వాక్సిన్ భారత్ కి అందుబాటులోకి వచ్చింది అన్న వార్తల పై మంత్రి స్పందించారు. అనేక వాక్సిన్ లు పరోక్షంగా తెలంగాణలోకి వస్తున్నాయి అని,కొన్ని క్లినికల్ ట్రయల్స్ కోసం వస్తుండగా, మరి కొన్నిటిని కొందరు తెలిసిన వారి ద్వారా తెచ్చుకొని వాడుకుంటున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే భారత్ లో కరోనా వైరస్ వాక్సిన్ ఎప్పటి లోగా అందుబాటులోకి వస్తుంది అని కేంద్ర మంత్రి ను అడిగాం అని, అందుబాటులోకి వస్టే ఎంతమందికి ఇస్తారు అనే విషయాన్ని ప్రస్తావించామని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే దశల వారీగా వాక్సిన్ ఇస్తే మొదటగా వైద్యులు మరియు పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని సూచించామని, అంతేకాక పేద ప్రజలకు కూడా ఉచితంగా వాక్సిన్ ఇవ్వాలని కోరుతూ తెలిపామ నీ మంత్రి వ్యాఖ్యానించారు. అయితే వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో కరోనా కేసులు మరియు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.