ఆక్సిజన్ పెట్టినా కూడా కొందరు మృత్యు వాత పడుతున్నారు – ఈటెల రాజేందర్!

Sunday, August 2nd, 2020, 03:53:34 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం పై, కట్టడి చర్యల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా పేషంట్ల కోసం గాంధీ ఆసుపత్రి డెడికేటెడ్ గా పని చేస్తుంది అని మంత్రీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. టీమ్స్ ను కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ ఆసుపత్రి గా మార్చినట్లు తెలిపారు. అయితే అందులో 1,350 పడకలు, లాబ్స్, ఐసీ యూ లతో పాటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని అన్నారు.

ఈ మాత్రం అయిన కరోనా లక్షణాలు కనబడినా ఆసుపత్రి లో చేరండి అని సూచించారు. అయితే లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఆక్సిజన్ పెట్టినా కూడా కొందరు మృత్యు వాత పడుతున్నారు అని తెలిపారు. అయితే ఈ మహమ్మారి చికిత్స పది వేల రూపాయల లోపే ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాక సామాన్యులను పీక్కు తినే ఆసుపత్రుల పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేకాక ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడకండి అని సూచించారు.