తెలంగాణలో ప్రతి గడప లో కరోనా టెస్టులు – మంత్రి ఈటెల

Saturday, October 3rd, 2020, 02:07:51 AM IST

శుక్రవారం నాడు మీడియా తో మాట్లాడిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నిమ్స్ ను తెలంగాణ రాష్ట్రం లోనే అత్యున్నత ఆసుపత్రి గా తీర్చి దిద్దుతాం అని తెలిపారు. అయితే ఢిల్లీ లో మాత్రమే ఉన్న మాలిక్యూలర్ ల్యాబ్ ను స్టెమ్ సెల్స్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడేవారి కోసం ఇక్కడే ప్రారంభించిన విషయాన్ని వెల్లడించారు. అంతేకాక బ్లడ్ క్యాన్సర్ తో బాధ పడే వారికి ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చికిత్స అందిస్తాం అని మంత్రి ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అన్ని ఆసుపత్రుల లో కెల్ల ఉన్నత వసతులు నిమ్స్ లో ఉన్నాయి అని తెలిపారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతున్న నేపద్యం లో అన్ని వైద్య సదుపాయాలను అందుబాటు లోకి తీసుకు వస్తున్నాం అని మంత్రి వ్యాఖ్యానించారు. ఐసీఎంఅర్ చెప్పిన విధంగా అన్ని మార్గదర్శకాలను పాటించి, ప్లాస్మా థెరపీ పేరిట చేసిన దోపిడీ అడ్డుకున్నాం అని మంత్రి అన్నారు. అయితే గతంలో వైరల్ ఇన్ఫెక్షన్ మాదిరిగా కరోనా వైరస్ కూడా అలానే ఉంది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రతి గడప లో కరోనా వైరస్ టెస్టు లు చేస్తున్నాం అని, నిమ్స్ లో ఓ పి పెంచేందుకు కృషి చేస్తున్నాం అని అన్నారు.