కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చే విషయం పై చర్చిస్తున్నాం – మంత్రి ఈటెల రాజేందర్

Friday, September 11th, 2020, 05:15:36 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి ఈటెల రాజేందర్ మరొకసారి మండలి సమావేశం లో వివరించారు. ప్రజారోగ్యం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఖర్చు అధః పాతాళం లో ఉంది అని ఈటెల రాజేందర్ అన్నారు. కరోనా వైరస్ ను అరికట్టడం లో వైద్య, ఆరోగ్య సిబ్బంది చేస్తున్న కృషి అనిర్వచనీయం అంటూ కొనియాడారు. ఆరోగ్య కార్యకర్తల కృషికి ఎంత ఇచ్చినా తక్కువే అవుతుంది అని మంత్రి సమావేశం లో తెలిపారు.

అయితే తెలంగాణ రాష్ట్రం లో రాబోయే రోజుల్లో ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత పెంచనున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ మహమ్మారి కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చే విషయం పై చర్చిస్తున్నాం అని అన్నారు. అయితే దీని పై సానుకూల నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స పొందాలి అని, కరోనా వైరస్ తీవ్రత పెరిగితే బాధితులను రక్షించడం కష్టం అవుతుంది అని అన్నారు.ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్త చర్యల వలన, కరోనా వైరస మరణాల్లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ లో తక్కువ అని తెలిపారు.