ప్రైవేట్ ఆసుపత్రులపై మరోసారి సీరీయస్ అయిన మంత్రి ఈటల..!

Tuesday, August 11th, 2020, 08:05:52 AM IST

తెలంగాణలో ఓ పక్క కరోనా కేసులు పెరిగిపోతుంటే, మరో పక్క కరోనా చికిత్స విషయంలో ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రులపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. సరైన వసతులు లేవని, బెడ్లు లేవని ప్రభుత్వాసుపత్రులపై ఫిర్యాదులు వస్తుంటే, లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తున్నారని, అడిగినంత కట్టకపోతే చనిపోయిన డెడ్‌బాడీనీ కూడా అప్పగించడం లేదని ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ తరుణంలో తాజాగ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ ప్రైవేటు ఆస్పత్రులపై వస్తున్న ఫిర్యాదులపై సమీక్ష జరిపారు. అధిక మొత్తంలో ఫీజులు వసూల్ చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి 1039 ఫిర్యాదులు వచ్చాయని, ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులకు ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చామని వాటి తీరు మార్చుకోకపోతే 50శాతం పడకల ప్రభుత్వ ఆధీనంలోని తీసుకుంటామని హెచ్చరించారు.