కరోనా రెండో స్టేజ్‌ గురించి ఆందోళన అవసరంలేదు – మంత్రి ఈటల

Wednesday, December 23rd, 2020, 09:00:04 PM IST

తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ రాకపోవచ్చని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. నేడు మీడియాతో మాట్లాడిన ఈటల కరోనా రెండో స్టేజ్‌ గురించి ఆందోళన అవసరంలేదని, ఒకవేళ సెకండ్ వేవ్ వచ్చినా ఎదురుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రజలు ధైర్యంగా, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అంతేకాదు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్‌పోర్టులోనే టెస్టులు చేసి ఐసోలేషన్‌కి పంపుతున్నామని, చలి కాలం కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయటికెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగ్గా ధరించాలని ఎవరూ అజాగ్రత్తగా వ్యవహరించవద్దని కోరారు.