ఆ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా త్వరగా పూర్తి కావాలి – మంత్రి ఎర్రబెల్లి!

Tuesday, August 11th, 2020, 02:47:10 AM IST


తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ కారణంగా పలు పనులు చాలా నెమ్మదిగా కొనసాగిన విషయం అందరికి తెలిసిందే. అయితే పల్లె ప్రగతి, హరిత హరం, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. అయితే పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖ ల పై ఉన్నతాధికారులు, డీపీవో లు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. అయితే అన్ని శాఖల్లో అమలు అవుతున్న కార్యక్రమాలు, వివిధ పనుల పట్ల సమీక్ష నిర్వహించారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా నెమ్మదించిన పనులు అన్నీ వేగవంతం గా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఉపాధి హామీకి అనుసంధానం ఉన్నటువంటి పనులను త్వరగా పూర్తి చేయాలని, కరోనా కట్టడికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అని, ఈ ప్రక్రియ లో ప్రజలను సైతం భాగస్వామ్యులను చేయాలి అని పిలుపు ఇచ్చారు. మిషన్ భగీరథ, ఉపాధి హామీ పనుల్లో రాష్ట్రం ముందు ఉంది అని అన్నారు.