రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో.. బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్..!

Saturday, January 9th, 2021, 07:46:00 AM IST

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని దమ్ముంటే కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి నిధులు తెప్పించు, చేతకాకుంటే నోరు దగ్గర పెట్టుకో అని ఎర్రబెల్లి హెచ్చరించారు. బీజేపీ నేతలు ఆలయాల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

అయితే కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మతం పేరుతో చిచ్చు రాల్చే ప్రయత్నం చేయకండని అన్నారు. అనవసరంగా టీఆర్ఎస్‌పై, సీఎం కేసీఆర్‌పై తప్పుడు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఎర్రబెల్లి అన్నారు. ఇకనైనా తప్పుడు మాటలు, అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ ఎలాగైనా అధికారం చేపట్టాలని ఇలాంటి పనులు చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ అధికారంలోకి రావడం జరగదని ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.