పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు.. బండి సంజయ్‌కి మంత్రి ఎర్రబెల్లి కౌంటర్..!

Wednesday, January 13th, 2021, 06:12:39 PM IST

తెలంగాణ రాస్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి మండిపడ్డారు. వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని రాయపర్తి మండలం మైలారం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు సంక్రాంతి కానుకగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి బండి సంజయ్‌పై సీరియస్ అయ్యారు.

అయితే బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ అద్యక్షుడిగా ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. బండి సంజయ్ మాటలు ప్రజలను, వారి మనోభావాలను, సెంటిమెంట్లను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి అభిప్రాయపడ్డారు. అభివృద్ధి మీద తెలుసుకోవాలనుకుంటే ఎవరు ఏం చేశారన్నది ప్రజలకు తెలిసేలా అధికారికంగానే సమావేశమై చర్చలు జరపాలి తప్పా, దేవాలయాల దగ్గర కాదన్న విషయాన్ని బండి సంజయ్ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సామాజిక బాధ్యతతో మెలగాలని పిచ్చిపిచ్చిగా మాట్లాడి ప్రజలను రెచ్చగొట్ట వద్దని మంత్రి ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు.