టీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీలో చేరనున్న మంత్రి సోదరుడు..!

Tuesday, December 15th, 2020, 04:42:02 PM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల నుంచి ఇంకా కోలుకోకముందే అధికార టీఆర్ఎస్ పార్టీకి వరుసపెట్టి షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు అసంతృప్తి నేతలు పార్టీనీ వీడి బీజేపీ గూటికి చేరగా తాజాగా మరో నేత కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కన్నేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఆయన పార్టీనీ వీడడం వలన ఎలాంటి నష్టం లేదని తమ పార్టీలో పక్కకు పెట్టిన వారు పార్టీ మారడం సహజమేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇలా వరుసపెట్టి నేతలు పార్టీనీ వీడుతుండడం పార్టీకి ఒకింత షాక్ అనే చెప్పాలి.