చంద్రబాబు ఎన్ని లక్ష కోట్ల స్కామ్ కి ప్లాన్ చేశారో తెలుసా – మంత్రి బొత్స సంచలన వాఖ్యలు

Friday, February 14th, 2020, 12:39:59 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టినటువంటి మూడు రాజధానుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రజలందరితో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్తఖంఠంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వ్యతిరేకిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే బస్సు యాత్ర చేయనున్నాడు కూడా. అయితే చంద్రబాబు నాయుడు చేయదలచుకున్న బస్సుయాత్ర పై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. \\

కాగా రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నాడో అర్థం కావడం లేదని, ఈ యాత్ర ని అడ్డం పెట్టుకొని కొన్ని కుట్రపూరితమైన ప్రణాళికలు వేస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు. అంతేకాకుండా ఒకటే దగ్గర కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేసే దోపిడీ చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇకపోతే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యఉద్దేశంతో రాష్ట్రానికి మూడు రాజధానుల నిర్మాణాన్ని చేపట్టాలనుకున్న సీఎం జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు కావాలనే కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.